Breaking News

అదానీ వన్‌తో మొబిక్విక్‌ భాగస్వామ్యం

Published on Mon, 01/15/2024 - 01:20

న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్‌ ట్రావెల్‌ బుకింగ్‌ యాప్‌– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్‌ సంస్థ మొబిక్విక్‌ తెలిపింది. మొబిక్విక్‌ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్‌ యాప్‌తో  భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. 

సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్‌ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము.  ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్‌ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పారు.

మొబిక్విక్‌ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్‌ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్‌ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్‌ యాప్‌లో మోబిక్విక్‌ సులభతరమైన ఫైనాన్స్‌ సొల్యూషన్‌లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్‌ బుకింగ్‌లు,  గ్లోబల్‌ బ్రాండ్‌లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’  అని అదానీ వన్‌ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)