Breaking News

బాస్ అంటే ఇలా ఉండాలి: ఉద్యోగులకు 51 కార్లు గిఫ్ట్

Published on Sat, 10/18/2025 - 15:22

దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తాయి, మరికొన్ని ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన కంపెనీలలో ఒకటి.. 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Limited). ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులు గత రెండేళ్లుగా కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే విధానం కొనసాగించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు.

ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ.. మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఎంకే భాటియా ఈ దీపావళికి.. తమ సంస్థలో పనిచేస్తూ ఉత్తమ పనితీరును కనపరిచిన 51 మంది ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇస్తూ.. వాటి తాళాలను తానే స్వయంగా అందజేసి.. ప్రతి ఒక్కరినీ అభినందించారు.

ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన కార్లను ఎందుకు బహుమతిగా ఇస్తారని భాటియాను అడిగినప్పుడు.. నా ఉద్యోగులే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి ప్రయత్నాలను గుర్తించడం.. వారిని కూడా ఎదిగేలా చేయడం మా విధి అని ఆయన అన్నారు.

కార్లను గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రదర్శించుకోవడానికి కాదు. జట్టులో స్ఫూర్తిని నింపడానికి, సంస్థను ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లడానికి అని ఆయన అన్నారు. టీమ్ లేదా ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడు.. కంపెనీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఈ సారి బ్రాండ్ కార్లను గిఫ్ట్ ఇచ్చారు అనే విషయం అధికారికంగా వెలువడలేదు.

ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)