Breaking News

సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‍వర్త్ ఎంతో తెలుసా?

Published on Sun, 05/18/2025 - 17:39

చెప్పులు లేకుండా సైకిల్ తొక్కడం, హెలికాఫ్టర్లలో నుంచి కిందికి దూకడం, బుర్జ్ ఖలీఫా ఎక్కడం, మోటార్ సైకిల్‌తో కొండపై నుంచి దూకడం వంటి స్టంట్స్ చేస్తూ.. ఎంతోమంది ప్రేక్షలకుల మనసు కొల్లగొట్టిన హాలీవుడ్ స్టార్ 'టామ్ క్రూజ్' ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే వారిలో ఒకరు. ఇంతకీ ఈయన నెట్‍వర్త్ ఎంత అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆరు పదుల వయసు దాటినా.. తన నటనతో దూసుకెళ్తున్న టామ్ క్రూజ్.. 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. 2025లో విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజే ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల్లో ఇదే మొదటిస్థానంలో నిలిచింది.

టామ్ క్రూజ్ నికర విలువ
అత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలిచిన టామ్ క్రూజ్ నికర విలువ.. పరేడ్ మ్యాగజైన్ ప్రకారం సుమారు 600 మిలియన్ డాలర్లు (రూ. 51.36 కోట్ల కంటే ఎక్కువ). సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే కాకుండా.. ఈయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా టామ్ క్రూజ్ సుమారు 100 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ది మ్యూజిక్ ఎసెన్షియల్స్ తెలిపింది. అంతే కాకుండా ఈయనకు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. రికార్డింగ్ స్టూడియోలో 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. సైంటాలజీ సంబంధిత వెంచర్లలో కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'

రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే.. టామ్ క్రూజ్ బెవర్లీ హిల్స్‌లో నివాసాన్ని 2007లో కొనుగోలు చేశారు. ఆ తరువాత 2021లో  తన 10,000 చదరపు అడుగుల కొలరాడో భవనాన్ని 40 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2015లో క్రూజ్ లండన్ సమీపంలోని 14 ఎకరాల ఎస్టేట్‌ను 7.3 మిలియన్ డాలర్లకు విక్రయించి.. హాలీవుడ్ కాంపౌండ్‌లోని నివాసాన్ని 12 మిలియన్ల రెసిడెన్సీ కొనుగోలు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)