Breaking News

11 ఏళ్లకే రేసింగ్‌లో రికార్డు.. మరెన్నో విజయాలు

Published on Sun, 08/06/2023 - 09:07

Shreyas Hareesh: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించారు.. సర్క్యూట్‌ రేసింగ్‌ చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడని భావించారు. 13 సంవత్సరాల వయసులోనే లెక్కకు మించిన అవార్డులు, బహుమానాలు.. అతి తక్కువ కాలంలో గొప్ప రేసర్‌గా గుర్తింపు పొందిన 'శ్రేయస్ హరీష్' అందరి ఆశలకు తెరదించి కన్ను మూసాడు.

నివేదికల ప్రకారం, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో 'శ్రేయస్ హరీష్' (Shreyas Hareesh) ప్రమాదానికి గురైనట్లు, హాస్పిటల్‌కి తరలించేలోపే కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో రేసింగ్ ఛాంపియన్‌షిప్ రద్దు చేశారు.

11 ఏళ్లకే చాంపియన్‌షిప్..
భారతదేశంలో మొట్టమొదటి మినీజీపీ చాంపియన్‌షిప్ కొట్టిన 'శ్రేయస్ హరీష్'.. తన ఐదేళ్ల ప్రాయంలోనే సైక్లింగ్లో మంచి నైపుణ్యం కనపరుస్తుండతో అతని తండ్రి హరీష్ పరంధామన్ ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. 11 సంవత్సరాలకే నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. 2022లో పెద్ద రైడర్స్‌తో కూడా పోటీపడి రికార్డ్ కొట్టిన ఘనత శ్రేయస్ సొంతం.

బెంగళూరుకు చెందిన శ్రేయాస్ ఇంటర్నేషన్ ఛాంపియన్ షిప్కి కూడా అర్హత సాధించి, అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. కార్లకు ఫార్ములా వన్ రేస్ మాదిరిగానే.. 'మోటో జిపి అనేది బైకులతో నిర్వహించే రేసింగ్' దీని గురించి మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు. 

రేసింగ్ బ్యాగ్రౌండ్ లేని తెలియని కుటుంబం నుంచి వచ్చిన శ్రేయస్ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది స్పెయిన్‌లోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడ జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఆగస్టులో మలేషియాలోని సెపాంగ్ సర్క్యూట్‌లో MSBK ఛాంపియన్‌షిప్ 2023లో 250సీసీ విభాగంలో (గ్రూప్ B) జట్టు CRA మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే శ్రేయస్ మృత్యువు కౌగిలి చేరిపోయాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)