Breaking News

వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

Published on Wed, 03/11/2026 - 15:43

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అంచనాలు తలకిందులు

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.

గత తప్పిదాల నుంచి పాఠాలు

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్‌ బ్యాంకులు భావిస్తున్నాయి.

బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితి

యూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.

ఇదీ చదవండి: చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)