Breaking News

టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!

Published on Mon, 08/25/2025 - 18:00

ప్రముఖ టెక్ దిగ్గజం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫీసులను ప్రారంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ 3, 4వ అంతస్తులలో ఆఫీస్ ఉంటుంది.

టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్‌తో ఒప్పందం ఐదు సంవత్సరాలు కాగా.. నెల అద్దె రూ. 5.4 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇది 2025 జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ స్టాక్ వెల్లడించింది. ఈ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా టెక్ దిగ్గజం రూ.92.94 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

లీజు పత్రాల ప్రకారం.. మొత్తం చెల్లింపు చదరపు అడుగుకు రూ.67 బేస్ అద్దెతో పాటు.. నిర్వహణ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, మూలధన ఖర్చులు, నిర్వహణ రుసుములు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది అద్దె 4.8 శాతం పెరుగుతుంది. కాగా కంపెనీ ఐదేళ్ల కాలానికి రూ.42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది.

ఇదీ చదవండి: భారత్‌లో మొదటి ఆఫీస్: ఓపెన్‌ఏఐలో జాబ్స్

హైదరాబాద్‌లో ఇతర భారీ ఆఫీస్ డీల్స్
హైదరాబాద్‌లోని ఇతర భారీ డీల్స్ విషయానికి వస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024లో 10.18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని అద్దె నెలకు రూ. 4.3 కోట్లుగా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 2024లో, ఫేస్‌బుక్ తన హైదరాబాద్ ఆఫీస్ స్థలం కోసం లీజును రెన్యువల్ చేసింది. ఇది మొత్తం 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని అద్దె నెలకు రూ.2.8 కోట్లు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)