Breaking News

భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ

Published on Fri, 10/25/2024 - 10:02

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్‌ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్‌ అవార్డుల విలువ 39 మిలియన్‌ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్‌ డాలర్లు.

జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్‌ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్‌ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..

ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు