Breaking News

300 మందికి జాబ్‌కట్‌ చేసిన ‍మైక్రోసాఫ్ట్‌

Published on Tue, 06/03/2025 - 11:50

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్‌ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స​్‌ ప్రకటించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్‌ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ చెప్పింది. ఈ లేఆఫ్స్‌ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

పనితీరుతో సంబంధం లేదు..

ఇటీవల టౌన్‌హాల్‌లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్‌ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్‌ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..

ఉద్యోగులపై ప్రభావం

మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్‌లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్‌ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫామ్స్‌తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్‌ఫోర్స్‌ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్‌లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్‌లో పనిచేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)