Breaking News

ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..

Published on Thu, 07/06/2023 - 14:53

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లక్షలు దాటుతున్న యూజర్లు..
నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు.

పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు.

(ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..)

pic.twitter.com/MbMxUWiQgp

ఎలాన్ మస్క్ స్పందన..
మెటా థ్రెడ్స్‌ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు.

(ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్‌!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)