లేఆఫ్‌ల ట్రెండ్‌.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్‌కు ఏకంగా..!

Published on Thu, 02/16/2023 - 13:50

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సహ వ్యవస్థాపకుడు  మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్‌ డాలర్లు పెంచి 14 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.115  కోట్లు) చేసింది. 

ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది.

ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జకర్‌బర్గ్‌ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌! ఏప్రిల్‌ 1 నుంచే ఐటీఆర్‌ ఫైలింగ్‌..)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)