Breaking News

మెటాలో ఇంత అన్యాయమా?

Published on Fri, 02/21/2025 - 17:16

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వారి బేసిక్‌ పేలో 200 శాతం వరకు బోనస్‌లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్‌ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్‌ ప్రకటన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వర్తించదని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.

అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్‌లకు బోనస్‌లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా బోనస్‌లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు.​​​​​​​ కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.

ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’

ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్‌లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్‌లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎగ్జిక్యూటివ్ బోనస్‌లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)