Breaking News

మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం

Published on Fri, 01/10/2025 - 14:01

మెటా గ్రూప్‌ తన ఆన్‌లైన్‌ సర్వీసులైన ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్‌ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్‌ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నట్లు అనలిటిక్స్‌ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్‌లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.

ట్రంప్‌ మెప్పు పొందేందుకేనా..?

ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ఇప్పటికే ప్రకటించారు.

కఠిన నిర్ణయాలు తప్పవు

రాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్‌ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’

తప్పుడు సమాచారం తగ్గుతుందా..?

మార్క్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్‌ చెకింగ్‌ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్‌ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్‌ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)