అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్! రేటు తెలిస్తే..
Published on Sat, 09/21/2024 - 09:38
బిలియనీర్లు, వ్యాపార ప్రముఖుల బిజినెస్ విషయాలే కాదు.. వారు ఏం ధరిస్తున్నారు.. లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విశేషాలూ వార్తల్లోకి వస్తుంటాయి. మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చేతికి అరుదైన వాచ్‌తో కనిపించారు. మరి ఔత్సాహికులు ఊరికే ఉంటారా ఆ వాచీ ఏ కంపెనీ, ధర ఎంత తదితర విషయాలు ఆరా తీసి కనిపెట్టేశారు.
జుకర్‌బర్గ్ ధరించిన గడియారం డి బెతునే కంపెనీకి చెందిన డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్. ధర 90,000 నుంచి 95,700 డాలర్లు (రూ. 75 లక్షల నుండి రూ.80 లక్షలు) మధ్య ఉంటుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అంటే దాదాపుగా భవిష్యత్ టెస్లా సైబర్‌ట్రక్ ధరంత. దీని రేటు 99,990 డాలర్లు. ఇది అరుదైన వాచ్. ఇలాంటివి సంవత్సరానికి కేవలం 20 వాచీలను మాత్రమే తయారు చేస్తారు.
డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్విస్ వాచ్‌మేకర్ వెబ్సైట్ ప్రకారం.. తెలుపు, గాఢ నీలం రంగుల్లో ప్రకాశవంతమైన డయల్, 24-క్యారెట్ బంగారంతో పాలపుంతలో నక్షత్రాల్లాగా అంకెలను సూచించే చుక్కలు, వాటిని తాకుతూ ముళ్లు, చుట్టూ మెరిసిపోతున్న రోజ్ గోల్డ్ ఫ్రేమ్ చూస్తేనే కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.
జుకర్‌బర్గ్ ప్రీమియం వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య తన భార్య భుజాలపై చేయి వేసుకుని తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన చేతికి ఖరీదైన వాచ్ ధరించారు. అది 1,41,400 డాలర్ల విలువైన పటెక్ ఫిలిప్ వాచ్ అని వెంటనే పట్టేశారు ఔత్సాహికులు.
Mark Zuckerberg spotted yesterday during the @AcquiredFM live wearing a DB25 Starry Varius in rose gold from De Bethune. 👀 pic.twitter.com/raZRTyzmAz
— ZwapX (@zwapxofficial) September 11, 2024
Tags : 1