Breaking News

మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!

Published on Fri, 11/15/2024 - 13:41

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్‌ కమిషన్‌ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్‌ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ యాడ్స్‌ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది.

‘యూరోపియన్ యూనియన్‌ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్‌బుక్‌ మార్కెట్‌ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్‌బుక్‌లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్‌లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్‌మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్‌ యాక్సెస్‌ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్‌బుక్‌ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్‌ కమిషన్‌ ఆరోపించింది.

ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు

కంపెనీ స్పందన

యురోపియన్‌ కమిషన్‌ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్‌బుక్‌ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది.

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు