Breaking News

మెటా ఏఐ యాప్‌ వచ్చేసింది..

Published on Wed, 04/30/2025 - 19:00

కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్‌ దిగ్గజాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల యాజమాన్య సంస్థ మెటా తన ఏఐ సాధనానికి ఎట్టకేలకు మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. టెక్స్ట్ సంభాషణలు, వాయిస్ చాట్స్‌, ఇమేజ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లను అందించే అధునాతన లామా 4 మోడల్‌తో నడిచే ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యేక ఫీచర్‌
మెటా ఏఐ యాప్ ఒక ప్రత్యేకమైన డిస్కవర్ ఫీడ్‌ను పరిచయం చేసింది. అదే  ఏఐతో యూజర్ల ఇంటరాక్షన్‌ను ప్రదర్శించే సోషల్ మీడియా-ప్రేరేపిత ఇంటర్‌ఫేస్. ఇది ఏఐ యాప్ ల్యాండ్ స్కేప్‌లో మొదటిది. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టించడం నుండి సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, కమ్యూనిటీ-ఆధారిత అనుభవాన్ని పెంపొందించడం వరకు ఇతరులు మెటా ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.  కేవలం టెక్ట్స్‌ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు.

వాయిస్ చాట్ కోసం ఎదురుచూపులే..
ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయినప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన వాయిస్ చాట్ ఫీచర్ మాత్రం భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌తోపాటు యూఏఈ, మెక్సికో వంటి ఇతర ఈ మార్కెట్లకు వాయిస్ చాట్‌ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది కంపెనీ వెల్లడించలేదు.

భారత్‌ త్వరలో రే-బాన్ మెటా గ్లాసెస్‌ను పరిచయం చేస్తున్న క్రమంలో మెటా ఈ యాప్‌ను లాంచ్‌ చేసినట్లు తెలుస్తోంది. మెటా ఏఐ యాప్‌తో అనుసంధానించే ఈ స్మార్ట్ గ్లాసెస్, నావిగేషన్ నుండి రియల్ టైమ్ అనువాదాల వరకు వినియోగదారుల దైనందిన జీవితంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని అందిస్తాయి. 
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లో మెటా ఏఐ యాప్‌ను పోటీ చర్యగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?