Breaking News

రూ.3000 కోట్లకు జర్మన్ కంపెనీ పెట్టుబడులు?

Published on Tue, 01/09/2024 - 07:55

న్యూఢిల్లీ: నూతన ఉత్పత్తులు, తయారీ కార్యకలాపాలు, డిజిటలీకరణకు ఈ ఏడాది రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్‌ వెల్లడించింది. దీంతో సంస్థ భారత్‌లో పెట్టుబడి రూ.3,000 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2023లో కంపెనీ భారత్‌లో రికార్డు స్థాయిలో 10 శాతం వృద్ధితో 17,408 యూనిట్లను విక్రయించింది. 2024లో మూడు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌తో కలిపి 12 కొత్త మోడళ్లు, వేరియంట్లను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రూ.1.5 కోట్లకుపైగా ఖరీదు చేసే టాప్‌ ఎండ్‌ మోడళ్లు సగం ఉంటాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. 

‘2024లో రెండంకెల వృద్ధి సాధిస్తాం. ఆర్డర్‌ బుక్‌ 3,000 యూనిట్లు ఉంది. అమ్మకాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతం. ఈవీల వాటా నాలుగేళ్లలో 20–25 శాతానికి చేరుకుంటుంది. ఎస్‌యూవీల వాటా 55 శాతం ఉంది. 10 నగరాల్లో కొత్తగా 20 వర్క్‌షాప్స్‌ ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. 

భారత్‌లో అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్లాంట్‌ను నెలకొల్పడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కోరుతున్నట్లు వచ్చిన నివేదికలపై అయ్యర్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం ఏదైనా పాలసీని ప్రకటిస్తే అది భారత్‌లో పెట్టుబడి పెట్టిన ప్రస్తుత తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని మాకు చాలా నమ్మకం ఉంది. ఈవీ విభాగంలోకి కొత్త కంపెనీని స్వాగతిస్తున్నాం. మార్కెట్‌లో ఈవీల స్వీకరణను ఇది మరింత తీవ్రతరం చేస్తుంది’ అని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌ వర్షన్స్‌లో రూ.1.32 కోట్ల ప్రారంభ ధరతో జీఎల్‌ఎస్‌ లగ్జరీ ఎస్‌యూవీని మెర్సిడెస్‌ విడుదల చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)