Breaking News

బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?

Published on Fri, 03/10/2023 - 14:28

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి తమ ఉత్పతుల ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ త్వరలో మోడల్ శ్రేణిలో సుమారు 5 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించింది.

2022 డిసెంబర్ నెలలో కంపెనీ 5 శాతం ధరలను పెంచింది. ఆ తరువాత 2023లో ధరలను పెంచడం ఇదే మొదటిసారి. యూరోతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ఇన్‌పుట్, లాజిస్టికల్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెరుగుదల జరిగిందని కంపెనీ ప్రకటించింది.

నిజానికి మెర్సిడెస్ బెంజ్ ఏ200 ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ధరల పెరుగుదల తరువాత ఈ మోడల్ ధర రూ. 44 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంటుంది. జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ ధర రూ. 10 లక్షలు పెరగనుంది. దీని కొత్త ధర రూ. 1.29 కోట్లు. అదే సమయంలో మేబ్యాచ్ ఎస్580 ధర రూ. 12 లక్షలు పెరగనుంది.

(ఇదీ చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?)

మెర్సిడెస్ బెంజ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే కాకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కూడా తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023లో 10 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సంకల్పించింది. ఇందులో క్యూ3 జిఎల్‌సి, జి-క్లాస్ వెర్షన్ వంటివి దేశీయ మార్కెటీలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)