మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్!
Published on Tue, 08/16/2022 - 13:03
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెట్టింది.2024-2026 నాటికి మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 2024 చివరి నాటికి ఈవీ సెగ్మెంట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు భారీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.
అదే సమయంలో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రాకు, ఎలాన్ మస్క్‌లను పోల్చుతూ మీమ్స్ చేస్తున్నారు.
— anand mahindra (@anandmahindra) August 15, 2022
ఓ ట్విట్టర్ యూజర్..ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆనంద్ మహీంద్రాను..భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాట్లను విరమించుకున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ ఓ మీమ్ చేశారు. అదే మీమ్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించడం ఆసక్తికరంగా మారింది.
ట్విట్టర్ యూజర్ అలేఖ్ షిర్కే 'టెస్లా నాట్ కమింగ్ టూ ఇండియా' అనే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు అమెజాన్ ప్రైమ్ 'మీర్జాపూర్' సిరీస్'లోని పంకజ్ త్రిపాఠీ "Chinta mat kariye. Hum prabandh karte hain (చింతించకు నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను)." అనే ఫేమస్ డైలాగ్‌ను యాడ్ చేశాడు.అంతే ఇప్పుడా ఆ మీమ్ ఆనంద్ మహీంద్రా అభిమానుల్ని నవ్వులు పూయిస్తుంది. అంతకాదండోయ్. ఆ మీమ్ నచ్చిన ఆనంద్ మహీంద్రా సైతం స్మైలీ ఎమోజీనీ యాడ్ చేసి రీ ట్వీట్ చేశారు.
చదవండి👉 సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది!
Tags : 1