Breaking News

రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్‌ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?

Published on Wed, 09/06/2023 - 17:16

​Sanjay Mehrotra భారతదేశంలోని గుజరాత్‌లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి  అమెరికా చిప్ దిగ్గజం మైక్రోన్ టెక్నాలజీ   కమిట్‌మెంట్‌ను పునరుద్ఘాటించిన తర్వాత సంజయ్ మెహ్రోత్రా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.   ఈ నేపథ్యంలో సంజయ్ మెహ్రోత్రా నెట్‌వర్త్‌, ఆయన సక్సెస్‌స్టోరీని ఒకసారి చూద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా ప్రపంచ ఐటీ పరిశ్రమ దిగ్గజాల్లో  ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఐటీ పరిశ్రమలో  విశేష సేవలందించారు.  బిట్స్‌ పిలానీ విద్యార్థి దేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చేలా దేశీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముందంజలో ఉన్న వ్యాపార నాయకులలో ఒకరుగా ఉన్నారు ఐఐటీ, ఐఐఎం, టిపుల్‌ ఐటీ లాంటివి  చదవకపోయినా  టెక్నాలజీలో, ఐటీ ఇండస్ట్రీలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు సంజయ్ మెహ్రోత్రా. 

1988లో ప్రముఖ బ్రాండ్ శాన్‌డిస్క్‌ని స్థాపించారు. 2011-2016 వరకు దానికి సీఈవోగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంటెల్, అట్మెల్ , ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మెహ్రోత్రా 2017లో మైక్రోన్ సీఈఓగా నియమితులయ్యారు.  మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ సీఈవో,ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ మెహ్రోత్రా  ప్రస్తుత అంచనా నికర విలువ సుమారు 57.36 మిలియన్‌ డాలర్లుగా అంచనా. ఆయన రోజు సంపాదన  రూ. 64 లక్షలు. 

మెహ్రోత్రా కాన్పూర్‌లో జన్మించినప్పటికీ, పెరిగింది మాత్రం ఢిల్లీలో  BITS పిలానీ నుండి B.Tech పూర్తి చేసిన తర్వాత, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేశారు.2009లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్  పట్టభద్రుడు.

సంజయ్ మెహ్రోత్రా 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్‌డిస్క్‌ని స్థాపించారు మరియు 2011 నుండి 2016 వరకు దాని CEOగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంటెల్, అట్మెల్ మరియు ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు.  మీడియా కథనాల ప్రకారం అతని రోజువారీ జీతం రూ.64 లక్షలు. 2023 నాటికి, సంజయ్ మెహ్రోత్రా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మైక్రోన్ టెక్నాలజీ, CDW, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ , ఇంజనీరింగ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)