Breaking News

గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Published on Mon, 10/26/2026 - 08:42

భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో శతాబ్దపు చరిత్ర కలిగిన దిగ్గజ బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మహాత్మా గాంధీ అంతరంగికుడిగా గుర్తింపు పొందిన జమనాలాల్‌ బజాజ్ జీవితం, ఆయన వ్యాపార దృక్పథం దేశ పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. రాజస్థాన్‌లోని సికార్ సమీపంలోని ‘కాశీ కా బాస్’ గ్రామంలో జన్మించిన జమనాలాల్‌ బజాజ్ తన వ్యాపార నైపుణ్యాలతో, దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన అందించిన ఆర్థిక వెన్నుదండతో భారత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు.

వ్యాపార ప్రస్థానం

1926లో రూపుదిద్దుకున్న బజాజ్ గ్రూప్, నాటి కాటన్ ట్రేడింగ్ (పత్తి వ్యాపారం) నుంచి ప్రారంభమై నేడు రూ.14 లక్షల కోట్ల రూపాయల భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. వర్ధా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ కాలక్రమేణా చక్కెర, స్టీల్, ఆటోమొబైల్స్ రంగాల్లోకి విస్తరించింది. 1939లో లాహోర్‌లోని ముకంద్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ స్వాధీనంతో భారీ పరిశ్రమల రంగంలోకి అడుగుపెట్టిన బజాజ్ గ్రూప్ దశాబ్దాల పాటు భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది. ముఖ్యంగా ‘హమారా బజాజ్’ నినాదంతో మధ్యతరగతి ప్రజలకు ద్విచక్ర వాహనాలను అందించిన బజాజ్ ఆటో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది.

మహాత్మా గాంధీ ‘ఐదో కుమారుడు’

దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత జమనాలాల్‌ బజాజ్ ఆయన సిద్ధాంతాలకు పూర్తిగా ఆకర్షితులయ్యారు. వర్ధాలోని తన ఆవాసాన్ని, భూమిని స్వాతంత్ర్య ఉద్యమ కార్యకలాపాల కోసం అప్పగించారు. గాంధీజీ చేపట్టిన ప్రతీ సృజనాత్మక కార్యక్రమానికి తన తనువు, మనసు, ధనంతో సంపూర్ణ సహకారం అందించిన జమనాలాల్‌ను మహాత్మా గాంధీ ఎంతో ప్రేమగా తన ‘ఐదో కుమారుడిగా’ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రధాన ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తూ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆర్థికంగా నిలబెట్టారు.

సామాజిక సంస్కరణలు

అపారమైన సంపద ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపిన జమనాలాల్‌ బజాజ్ గాంధీజీ ప్రతిపాదించిన ‘ట్రస్టీషిప్’ సిద్ధాంతాన్ని పాటించారు. సంపద అనేది వ్యక్తిగత భోగభాగ్యాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఒక ట్రస్ట్‌లా నిర్వహించాలనే ఆయన నమ్మకం వ్యాపార వర్గాల్లో నైతిక విలువలకు పునాది వేసింది. అంతేకాకుండా, 1928లోనే తన కుటుంబానికి చెందిన వర్ధాలోని లక్ష్మీనారాయణ్ మందిరాన్ని దళితుల కోసం తెరిచి సమాజంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని ఎదిరించిన సాహసోపేత సంస్కర్త ఆయన.

‍ప్రస్తుతం రూ.14 లక్షల కోట్ల గ్రూప్‌గా..

1942 ఫిబ్రవరి 11న ఆయన తుదిశ్వాస విడిచినప్పటికీ ఆయన స్థాపించిన విలువల పునాదులపైనే నేడు రూ.14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో బజాజ్ గ్రూప్ విస్తరించింది. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘జమునాలాల్‌ బజాజ్ ఫౌండేషన్’ ద్వారా ఏటా అందించే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సమాజ సేవకులకు గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తున్నాయి. వ్యాపారాన్ని దేశభక్తితో, నైతిక విలువలతో ఎలా అనుసంధానించవచ్చో నిరూపించిన జమనాలాల్‌ బజాజ్ జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయమే.

ఇదీ చదవండి: రోగుల ప్రాణాలతో రాబందుల వ్యాపారం

Videos

Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

విర్రవీగుతున్న ఒక్కొక్కడిని చెప్తున్నా.. 2029 అధికారంలోకి వస్తే.. మీ ఊహకే వదిలేస్తున్న..

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

Photos

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)