Breaking News

హైదరాబాద్‌లో మెక్‌ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్

Published on Wed, 10/29/2025 - 18:04

హైదరాబాద్‌: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్‌ చెయిన్‌ మెక్‌ డోనాల్డ్ తన గ్లోబల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో తెరిచింది. టీ హబ్ సమీపంలో ఏర్పాటైన మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్ డోనాల్డ్ గ్లోబల్  ఆఫీస్ ఒక ప్రతీక అన్నారు. మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ అద్భుత ప్రతిభకు నిదర్శనం అన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు.

మెక్‌ డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని, సిబ్బందిని హైదరాబాద్‌కు స్వాగతించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. 1940లలో మెక్‌డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు..  పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచిందన్నారు.

మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఈ నూతన కేంద్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయం అని అభివర్ణించారు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి అనేక సెంటర్లకు రాజధానిగా మారిందని, వందలాది గ్లోబల్ కేపబిలిటీ హబ్‌లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)