Breaking News

ఐపీఎల్‌ టీమ్‌లతో మాస్టర్‌ కార్డ్‌ జట్టు

Published on Thu, 04/17/2025 - 09:25

క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మక్కువ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని మాస్టర్ కార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) భాగస్వామ్యంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది. డైనింగ్ డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయాణ సౌకర్యాలను అందించడం ద్వారా క్రికెట్ ఔత్సాహికులకు సేవలందించడానికి ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపింది.

మాస్టర్‌ కార్డ్‌, సిటీ యూనియన్ బ్యాంక్‌(సీయూబీ) భాగస్వామ్యంతో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ను రిప్రెజెంట్‌ చేసేలా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తయారు చేసింది. ఇందులో సీయూబీ సీఎస్‌కే మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు, సీయూబీ సీఎస్‌కే వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డు, సీయూబీ ఎస్ఆర్‌హెచ్‌ మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు, సీయూబీ ఎస్‌ఆర్‌హెచ్‌ వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులున్నాయి.

ఇదీ చదవండి: ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..

మాస్టర్ కార్డ్ దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘సీఎస్‌కే మాస్టర్‌ వరల్డ్, మాస్టర్‌ కార్డ్‌ వన్ డైన్స్ ఫ్రీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. ఇది ఆసియా పసిఫిక్ అంతటా ప్రముఖ రెస్టారెంట్లలో కాంప్లిమెంటరీ మెయిన్ కోర్సును అందిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన నగరాల్లోని టాప్ రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు కాంప్లిమెంటరీ మెయిన్ కోర్సును వెసులుబాటు ఉంటుంది. మాస్టర్ కార్డ్ కలినరీ క్లబ్ ప్రోగ్రామ్ భారతదేశంలోని కొన్ని ఉత్తమ రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపును అందిస్తుంది. అంతేకాక, ఈ క్రెడిట్ కార్డు మాస్టర్ కార్డ్ వన్ నైట్ ఫ్రీ ప్రోగ్రామ్‌కు కూడా అర్హత కలిగి ఉంటుంది. దీనిలో కార్డుదారుడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వామ్య హోటళ్లు, రిసార్ట్‌ల్లో కాంప్లిమెంటరీగా ఒక రాత్రి బస చేసేందుకు అవకాశం ఉంటుంది’ అన్నారు.

స్వాగత బహుమతిగా జెర్సీ

సిటీ యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం సీయూబీ సీఎస్‌కే మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు నిర్దిష్ట ఖర్చు పరిమితికి లోబడి సీఎస్‌కే జెర్సీని స్వాగత బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపింది. సీయూబీ సీఎస్‌కే వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డు ఒరిజినల్ ధోని నెం 7 జెర్సీని ఎటువంటి నిబంధనలు లేకుండా స్వాగత బహుమతిగా అందిస్తుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)