Breaking News

జీఎస్‌టీ హీట్‌: దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీకి షోకాజ్‌నోటీసులు

Published on Sat, 09/30/2023 - 13:44

ఆన్‌లైన్‌ గేమింగ్‌  కంపెనీలు, బీమా , తదితర కంపెనీలు షోకాజ్‌ నోటీసుల తరువాత తాజాగా  ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకి ఇండియాకి జీఎస్‌టీ షాక్‌ తగిలింది. వడ్డీ , పెనాల్టీలతో పాటు రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలపై పన్ను బాధ్యతకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలంటూ జీఎస్‌టీ అధికారులు కంపెనీకి షోకాజ్‌ నోటిసులు పంపించారు. అయితే దీనిపై స్పందించిన మారుతి ఇప్పటికే చెల్లించిన పన్నుకు,  2017 జూలై -2022 ఆగస్టు వరకు నిర్దిష్ట సేవలపై రివర్స్ ఛార్జ్ విషయానికి సంబంధించిన నోటీసు అని కంపెనీ తెలిపింది. 

"అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు షోకాజ్ నోటీసుకు తమ జవాబును ఫైల్‌ చేయనున్నామని, అలాగే ఈ నోటీసు తమ ఆర్థిక, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌ సమాచారాన్ని అందించింది. అలాగే  2006 జూన్ నుండి మార్చి 2011 మధ్య కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేస్తూ పంజాబ్ అండ్‌ హర్యానా హైకోర్టు నుండి తమకు అనుకూలమైన ఉత్తర్వు లభించిందని కంపెనీ తెలిపింది.  దీనిపై జరిమానాను కూడా కోర్టు  తొలగించినట్టు వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ అప్పీల్‌లో పెనాల్టీ తోకలిపి మొత్తం పన్ను  రూ. 57.2 కోట్లు.

కాగా మారుతీ ఈ ఏడాది ఆగస్టు అత్యధిక నెలవారీ అమ్మకాల్లో1,89,082 యూనిట్లతో కీలక మైలురాయిని సాధించింది. వివిధ సబ్-సెగ్మెంట్ మోడల్‌లతో సహా దేశీయ విక్రయాలలో 1,58,678 యూనిట్లను నమోదు చేసింది.  తన మొత్తం లైనప్‌లో పూర్తి స్వదేశీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీపై పట్టు సాధిస్తే,విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)