Breaking News

మారుతీ లాభం హైస్పీడ్‌

Published on Tue, 08/01/2023 - 03:56

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ
సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది.

కాంట్రాక్ట్‌ తయారీకి టాటా
సుజుకీ మోటార్‌ గుజరాత్‌(ఎస్‌ఎంజీ)తో కాంట్రాక్ట్‌ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్‌ఎంసీ నుంచి ఎస్‌ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్‌ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్‌ఐ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు.  

6 శాతం అప్‌
క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి.
ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్‌ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)