Breaking News

రూ. 35వేల కోట్ల పెట్టుబడి: 10 లక్షల వెహికల్స్!

Published on Sun, 01/18/2026 - 19:34

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్‌లోని ఖోరాజ్‌లో కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.

గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.

ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్‌లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)