Breaking News

వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు

Published on Fri, 07/25/2025 - 14:42

భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్‌యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్‌లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.

గుజరాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్‌ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్‌లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్‌

2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)