Breaking News

మారుతి జిమ్నీ ఫస్ట్ కారు వచ్చేసింది - ఇక లాంచ్ అప్పుడే!

Published on Fri, 05/12/2023 - 16:43

2023 ఆటో ఎక్స్‌పోలో 'మారుతి జిమ్నీ' 5 డోర్ వెర్షన్ కనిపించినప్పటినుంచి ఈ SUV కోసం ఎంతో మంది వాహన ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మారుతి సుజుకి ఈ కారు గురించి ఒక అప్డేటెడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక విక్రయాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం.

మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా. మార్కెట్లో ఈ కారు ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.

జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 

మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది.

(ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో)

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి జిమ్నీ ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్'కి ప్రత్యేతిగా నిలబడుతుంది. కావున అమ్మకాల పరంగా కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)