Breaking News

సాక్షి మనీమంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

Published on Fri, 10/13/2023 - 10:00

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో మదుపర్లు లాభాలను స్వీకరించారు.

మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్‌  ఫలితాలు మదుపర్లను  నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్‌కు పాజిటివ్‌ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. 

నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్‌ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది. 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, యాక్సిక్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది.

టాటా స్టీల్‌ లాంగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సాయి సిల్క్స్‌ కళామందిర్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్‌ లైఫ్‌ స్టైల్‌  కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)