Breaking News

లాభాలు ఒకరోజుకే పరిమితం

Published on Wed, 02/19/2025 - 03:43

ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్‌ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.

ఇండస్ట్రియల్, కన్జూమర్‌ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్‌ గూడ్స్, ఆటో, కన్జూమర్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్‌ సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి.

 అయితే మిడ్‌సెషన్‌ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్‌ ఇండెక్స్, క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది.  

అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2% క్షీణించింది. మిడ్‌ క్యాప్‌ సూచీ 0.19 శాతం నష్టపోయింది.  

రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద 

స్టాక్‌ మార్కెట్‌ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్‌ 8న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు