Breaking News

మౌలిక వసతులకు భారీ నిధులు

Published on Fri, 01/24/2025 - 08:17

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్య సాధనకు, అందరికీ సామాజిక భద్రత కోసం మౌలిక వసతులకు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున బడ్జెట్‌(Budget 2025-26) కేటాయింపులు అవసరమని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. ఇలా 25 ఏళ్లపాటు నిధులు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఐఎస్‌ఎస్‌ఏ–ఈఎస్‌ఐసీ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా మంత్రి ప్రసంగించారు.

2012లో మౌలిక వసతుల కోసం చేసిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.1.2 లక్షల కోట్లుగానే ఉండేవని, 2014లో నరేంద్ర మోదీ సర్కారు రూ.2.4 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. ‘2024కు వచ్చే సరికి బడ్జెట్‌ కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లకు పెరిగాయి. దీన్ని రూ.15 లక్షల కోట్లకు తీసుకెళ్లాలి. వచ్చే 25 ఏళ్ల పాటు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున ఖర్చు చేస్తే భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?

దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఫలితంగా కొత్త రంగాల్లో ఉద్యోగాల కల్పన ఇనుమడిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త రంగాల్లో (క్విక్‌ కామర్స్‌ తదితర) కార్మికులకు సామాజిక భద్రతను ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)