Breaking News

లగ్జరీ బైక్‌పై హీరోయిన్ సందడి, లుక్స్‌లో ఎక్కడా తగ్గేదెలే!

Published on Sat, 02/18/2023 - 14:45

గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి.

తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు.

బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి.

సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్‌పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)