Breaking News

మణిపాల్‌ హెల్త్‌ ఐపీవో.. షేరు ధర ఇలా..

Published on Sat, 07/25/2026 - 11:24

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ దిగ్గజం మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మెగా పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్‌ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.  

మణిపాల్‌ హెల్త్‌ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్‌ హాస్పిటల్స్‌కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌ (13,000 బెడ్స్‌) కలిగిన మణిపాల్‌ హెల్త్‌.. 2025 సెపె్టంబర్‌ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి 
హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు మణిపాల్‌ హెల్త్‌ ఎండీ, సీఈఓ దిలీప్‌ జోస్‌ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్‌ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్‌ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్‌ వెల్లడించారు.­

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)