తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్

Published on Sun, 11/23/2025 - 14:57

కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. వర్క్ చేయాలని పట్టుబడుతున్నాయి. తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మేనేజర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.

నా భార్య ప్రసవ వేదనలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా.. మేనేజర్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమని అన్నారు. ఉద్యోగి ఆ విషయాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. ''నా భార్య మా మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నేను మేనేజర్‌కు ఈ విషయం గురించి చెప్పి రెండు రోజులు మాత్రమే సెలవు అడిగాను. అయితే మేనేజర్ సానుభూతి చూపించడానికి బదులు, ఆసుపత్రి నుంచే వర్క్ చేయమని అన్నారు. మా బిడ్డపై ద్రుష్టి పెట్టాల్సిన సమయంలో నేను ఆసుపత్రి గదిలో నా ల్యాప్‌టాప్‌తో కూర్చోవడం సరైంది కాదు. నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, ఎందుకంటే.. నా బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి, నేను వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో అని భయంగా ఉందని'' అన్నారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మేనేజర్‌పై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పని ఉంటుంది. ముందు మీ భార్యను చూడండి అని ఒకరు, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. నేను ఇండియాలో పనిచేయకపోవడం మంచిది అయిందని ఇంకొకరు అన్నారు. భార్య, బిడ్డ జీవితంలో చాలా కీలకం.. ఆ దిశగా ఆలోచించు అని మరొకరు అన్నారు.

ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)