జస్ట్‌ 99.. కానీ కాస్ట్‌లీ

Published on Mon, 12/22/2025 - 06:05

ఓ 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ఒకటి రెండు రూపాయలు పెరిగితే చాలు. దేశమంతా భగ్గుమనేది. ప్రతిపక్షాలు బంద్‌లకు పిలుపునిచ్చేవి. ధర్నాలు, రాస్తారోకోలు మామూలే. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పెంచినదాంట్లో కొంత తగ్గించేది. దాంతో పరిస్థితి సర్దుమణిగేది. కానీ 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం రోజువారీ ధరలు మారే విధానాన్ని అమల్లోకి తెచి్చంది. అంటే అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను సవరించటమన్న మాట. కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేనాటికి పెట్రోలు ధర లీటరుకు రూ.65. నాటి నుంచీ ధరలు రోజూ పైసా నుంచి 5 పైసల వరకు పెరగటం మొదలయ్యాయి.

 అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా... అది తాత్కాలికమే. మెల్లగా ఎనిమిదేళ్లు తిరిగేసరికి ప్రస్తుతం లీటరు ధర ఏకంగా రూ.105కు చేరింది. విచిత్రమేంటంటే ఇంతలా పెరిగినా బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు జరగలేదు. జనం కనీసం ఆగ్రహాన్ని కూడా వ్యక్తంచేయటం లేదు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది వారికి నొప్పి తెలియకుండా జరిగింది. ఇదంతా ఎందుకంటే... నెలవారీ సబ్ర్‌స్కిప్షన్లు కూడా ఇలా నొప్పి తెలియకుండా మన జేబుకు చిల్లు పెట్టేవే. కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే... వీటిద్వారా వృధా కాకుండా బాగానే ఆదా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

ఏడాదికి 30వేల నుంచి లక్ష వరకూ 
డిజిటలైజేషన్‌ పెరిగాక సబ్ర్‌స్కిప్షన్ల యుగం మొదలైంది. ఇపుడవి నగరవాసుల జీవితాల్లో భాగమైపోయాయి. ఓటీటీలు, మ్యూజిక్, క్లౌడ్‌ స్టోరేజీ, లెరి్నంగ్‌ యాప్‌లు, ఏఐ యాప్‌లు... ఇలా ఒకటేమిటి!. రకరకాల యాప్‌లు. వాటిలో నిజంగా ఏది అవసరం, ఏది అనవసరం అనేది కాస్త ఆగి, ఆలోచించకుండా, ఎడా పెడా సబ్‌్రస్కయిబ్‌ చేసేసే ధోరణి పెరుగుతోంది. పైపెచ్చు ఎదిగిన పిల్లలున్న ఇంట్లో అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే యాప్‌ను సబ్‌్రస్కయిబ్‌ చేస్తున్న సందర్భాలు అనేకం. తాజా సర్వేల ప్రకారం ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి యావరేజ్‌గా 5–12 సబ్‌స్క్రిప్షన్లు ఉంటున్నాయి. యాప్‌ని బట్టి ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్‌ ఖర్చు అత్యంత తక్కువగా తొంభై తొమ్మిది రూపాయలేగా అనే ధోరణితో లైట్‌గా తీసుకుంటున్నప్పటికీ, మొత్తం సబ్‌స్క్రిప్షన్లన్నీ కలిపితే ఈ ఖర్చు ఏడాదికి 30–40 వేలు దాటిపోతోంది. ఇక పిల్లలు కూడా సబ్ర్‌స్కయిబ్‌ చేస్తున్న కుటుంబాల్లో ఈ ఖర్చు లక్షకు దగ్గర్లోనే ఉంటోంది. అందుకోసమే వీటిని నియంత్రించుకోవటంపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతోంది.  

ఒకటీ రెండూ కాదు... 
ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌లతో మొదలుపెడితే హాట్‌స్టార్, జీ5, సన్‌ టీవీ, ఎయిర్‌టెల్‌ ప్లే, ఆహా, ఎంఎక్స్‌ ప్లేయర్‌ సహా పదులకొద్దీ ఉన్నాయి. వీటిలో 99 శాతానికి సబ్‌్రస్కిప్షన్‌ తప్పనిసరి. కొన్నింటికి సబ్‌్రస్కిప్షన్‌ తీసుకున్నా కూడా... యాడ్‌లు లేకుండా చూడాలంటే మరింత ఎక్కువ పెట్టి సూపర్‌ సబ్‌్రస్కిప్షన్‌ తీసుకోవాలి. ఇక మ్యూజిక్‌ కోసం స్పాటిఫై, గానా వంటివి... క్లౌడ్‌ స్టోరేజీ కోసం గూగుల్‌ వన్, ఐక్లౌడ్‌ వంటివి... సోషల్‌ మీడియా, ఏఐ కోసం ట్విటర్, చాట్‌ జీపీటీ, గ్రోక్‌ వంటివి... ఇవన్నీ కాకుండా రకరకాల లెరి్నంగ్‌ యాప్‌లు, ఫిట్నెస్‌ యాప్‌లు, యాంటీ–వైరస్‌లు, ఈ–కామర్స్‌ మెంబర్‌íÙప్‌లు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ సబ్‌స్క్రిప్షన్లు రూ. 99, రూ. 149, రూ. 299..రూ.499 ఇలా ఉంటున్నాయి. 

విడివిడిగా యాప్‌లకు సబ్‌్రస్కయిబ్‌ చేస్తాం కనక అదేం పెద్ద మొత్తం కాదనిపిస్తుంది. కానీ ఇదో ఉచ్చులాంటిదని గ్రహించం. చాలా మటుకు సబ్‌్రస్కిప్షన్లను కావల్సినప్పుడు క్యాన్సిల్‌ కూడా చేసుకోవచ్చు కదా అని ముందుగా తీసుకుంటాం. ప్రతి నెలా గుర్తుంచుకుని మరీ కట్టే బాదరబందీ ఎందుకు, ఆటోమేటిక్‌గా రెన్యూ చేసుకునే ఆప్షన్‌ని ఎంచుకోండి అని యాప్‌ సూచించగానే ఓకే కొట్టేస్తాం. ఆటో రెన్యువల్‌ మోడల్‌ పెట్టేస్తాం. కానీ ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోతాం. నెల తిరగ్గానే కొద్ది కొద్ది మొత్తం కట్‌ అయిపోతుంటుంది. ముందుగా మెసేజ్‌లు వస్తాయి గానీ... వంద, రెండొందలే కదా అని పెద్దగా పట్టించుకోం. కానీ అన్ని యాప్‌లూ కలిస్తే ఎంతవుతోంది? నెలకు మొత్తంగా ఎంత కడుతున్నాం? ఏడాదికి ఎంతవుతోంది? అనేది ఆలోచించం. అలా... వేల రూపాయల్ని చెల్లిస్తూనే ఉంటాం. 

సైకాలజీ ఏమంటుందంటే.. 
దీని వెనుక సైకాలజీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈఎంఐలను, సబ్‌స్క్రిప్షన్లను మెదడు వేర్వేరు రకాలుగా ప్రాసెస్‌ చేసుకుంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కింద కట్టాలంటే అదొక పెద్ద మొత్తంగా కనిపించి, భారంగా అనిపిస్తుంది. కానీ సబ్‌స్క్రిప్షన్‌ అంటే మరీ పెద్ద మొత్తం కాదు కదా.. ఫర్లేదులే అనే అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష టీవీకి ప్రతి నెలా ఈఎంఐ కట్టాలంటే, అబ్బో అంత కట్టాలా .. అని కాస్త భయం వేస్తుంది. కానీ ప్రతి నెలా ఓ సబ్‌్రస్కిప్షన్‌కి రూ. 199 కట్టాలంటే ఫర్లేదులే అనిపిస్తుంది. కానీ అలాంటివి రూ. 199 చొప్పున ఓ పన్నెండు సబ్ర్‌స్కిప్షన్లు ఉన్నాయంటే! నెలకు దాదాపు రూ. 2,400 అవుతుంది. అదే ఏడాదికి చూస్తే సుమారు రూ. 30,000 అవుతుంది. అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఒక్కో సబ్ర్‌స్కిప్షన్‌కి కట్టే మొత్తం తక్కువగా ఉండటం వల్ల, పెద్ద భారం కాదులే అని మెదడు లైట్‌గా తీసుకుంటుందట!. 

దీన్నుంచి ఎలా బయటపడాలంటే 
ఎంత పెద్ద పడవైనా, చిన్న రంధ్రం పడితే చాలు. నీరు మెల్లగా చేరి అంత పెద్ద పడవ కూడా మునిగిపోయే ముప్పుంటుంది. అలాగే చిన్న చిన్న మొత్తాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే బడ్జెట్‌ అదుపు తప్పేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు ఏం చేయాలంటే... 
→ వన్‌–్రస్కీన్‌ విధానం: కుటుంబం ఉపయోగిస్తున్న ప్రతి సబ్‌్రస్కిప్షన్‌ వివరాలనూ పేపరు మీద రాయండి. ఒక్కొక్క దాని అవసరాన్ని బట్టి ‘తప్పనిసరి’, ‘ఉపయోగకరం’, ‘వ్యర్ధం’ అనే రేటింగ్‌ ఇచ్చుకోండి.  
→ మూడు నెలల పాటు... అంటే 90 రోజులుగా ఉపయోగించుకుండా నిరుపయోగంగా ఉన్న సర్వీసులను తక్షణం క్యాన్సిల్‌ చేయండి. 
→ అవసరం అనుకుంటే వార్షిక ప్లాన్లకు మారండి. నెలవారీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్‌ ప్లాన్లు సుమారు 15–40 శాతం వరకు చౌకగా ఉంటాయి.  
→ ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్లను షేర్‌ చేసుకోండి. నెట్‌ఫ్లిక్స్‌ / స్పాటిఫై / గూగుల్‌ వన్‌ ఫ్యామిలీ ప్లాన్లతో 50–80 శాతం వరకు ఆదా అవుతుంది.  
→ కొందరు టెలికామ్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లు తమ సర్వీసులతో పాటు ఓటీటీలు కాంబోగా అందిస్తున్నారు. ఇలాంటివి చాలా తక్కువ ధరే ఉంటాయి. సరీ్వసు గనక మంచిదైతే... కాంబోలో ఇస్తున్న ఓటీటీలతో మనకు ఆదా అవుతుందనుకుంటే తీసుకోవచ్చు.  

చివరిగా చెప్పేదేమిటంటే.. సబ్ర్‌స్కిప్షన్లనేవి పూర్తిగా చెడ్డవేమీ కావు. కాకపోతే వాటి సరీ్వసులు, నాణ్యతకన్నా మన అవసరం ముఖ్యం. పెద్దగా అవసరం లేనపుడు ఎంత మంచి యాప్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేస్తే మాత్రం ఏంటి లాభం? అందుకే వాడుకోలేకపోతే ఈ యాప్‌ల వల్ల ఏటా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చల్లగా వృధా అయిపోయే ప్రమాదముంది. మధ్య తరగతి వారికి ఈ మొత్తం ఒక నెల, లేదా ఏడాది సిప్‌కి (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌), ఓ రెండు, మూడు గ్రాముల బంగారానికి, ఓ దేశీ విహారయాత్ర ఖర్చులకు సరిసమానం. కాబట్టి 
జాగ్రత్తగా ఉపయోగించుకుంటే శ్రేయస్కరం.

 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)