Breaking News

అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం

Published on Tue, 05/27/2025 - 17:34

కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు ఎందరికో మార్గదర్శకం అవుతాయి. మరికొన్ని సంఘటనలు ఊహకందని మలుపులు తిరుగుతూ అదఃపాతాళానికి తొక్కేస్తాయి. కారణం ఏదైనా.. కర్త మాత్రం ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో చూసేద్దాం.

ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి 'సుబ్రమణియన్' ఒక ప్రతిభావంతులైన ఇంజనీర్.. బ్యాంకర్ కూడా. జీరోతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన కారాగారంలో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించిన ఈయన.. లాభాలను గడించారు.

రూ. 137 కోట్ల పెట్టుబడి
సుబ్రమణియన్ ప్రారంభించిన విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థ.. ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్, సేఫ్టీ ప్లస్ వంటి పథకాలను ప్రసిద్ధి చెందింది. ఈ పథకాలన్నీ ఇతర బ్యాంక్ డిపాజిట్లు లేదా పెట్టుబడి ఎంపికల కంటే గణనీయంగా అధిక రాబడికి హామీ ఇచ్చాయి. వీటన్నింటికీ ఆకర్షితులైన.. సుమారు 587 మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 137 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసినవారే ఉన్నారు.

సుభిక్షకు మద్దతు
విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించిన తరువాత 1997లో 'సుభిక్ష' అనే రిటైల్ సంస్థను సుబ్రమణియన్ స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఏకంగా 1600 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లకు విస్తరించింది. కంపెనీ విలువ రూ. 3,500 కోట్లకు చేరుకుంది. అజీమ్ ప్రేమ్‌జీ, ఐసిఐసిఐ వెంచర్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి హై-ప్రొఫైల్ పెట్టుబడిదారులు కూడా సుభిక్షకు మద్దతు ఇచ్చారు.

ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి

అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న సమయంలో.. పెట్టుబడిదారుల నిధులను సుబ్రమణియన్ షెల్ కంపెనీలకు మళ్లించారు. ఇదే ఈయన జీవితాన్ని మలుపుతిప్పి కష్టాల సుడిగుండంలోకి తీసుకెళ్లింది. 2008లో సుబ్రమణియన్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. దీంతో పెట్టుబడిదారులకు కూడా రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. 2009లో సుభిక్ష క్లోజ్ అయింది. దీంతో సుబ్రమణియన్ విశ్వసనీయత కుప్పకూలింది.

20 సంవత్సరాల జైలు శిక్ష
10 సంవత్సరాలుగా స్వచ్ఛంద డిపాజిట్లు చేయడంలో విఫలమయ్యారని, అన్ని కార్యక్రమాలలో డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.137 కోట్లకు పైగా చెల్లింపులు చేయలేకపోయారని తెలిసింది. దీంతో నవంబర్ 2023లో, తమిళనాడులోని చెన్నైలోని ఒక ప్రత్యేక కోర్టు వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినందుకు 'సుబ్రమణియన్'ను దోషిగా నిర్ధారించి.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)