Breaking News

కోటిన్నర జీతంతో కొత్త ఉద్యోగం.. అంతా AI సాయమే..

Published on Thu, 07/30/2026 - 14:36

ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించి చివరకు కొత్త కొలువు సాధించాడు ఓ ప్రొఫెషనల్. ఈ ప్రయాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు. ప్రొఫెషనల్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడికి లభించిన కొత్త ఉద్యోగంలో జీతం ఏడాదికి 1,55,000 డాలర్లు (సుమారు రూ.1.48 కోట్లు). దీనికి 15 శాతం వార్షిక బోనస్ అదనం. బోనస్ పూర్తిగా లభిస్తే మొత్తం వార్షిక ప్యాకేజీ సుమారు 1,78,250 డాలర్లు (రూ.1.7 కోట్లకు పైగా) అవుతుంది.

పదేళ్ల ఉద్యోగం.. ఒక్కసారిగా లేఆఫ్

రెడిట్‌ పోస్టు ప్రకారం.. ఆ వ్యక్తి ఒకే సంస్థలో దాదాపు పదేళ్లు పనిచేశాడు. ఈ కాలంలో మూడు ప్రమోషన్లు కూడా పొందాడు. అయితే ఫిబ్రవరి చివర్లో అనూహ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అనంతరం దాదాపు ఐదు నెలల పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా అనేక చోట్ల తిరస్కరణ ఎదురైంది. కొన్ని ఉద్యోగ ఖాళీలు రద్దు కాగా, మరికొన్ని నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. ఇంకొన్ని పోస్టులను చివరకు సంస్థలోని అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేశారని అతను తెలిపాడు.

అతడి ప్రొఫైల్ ప్రధానంగా క్లయింట్ సర్వీసెస్, ముఖ్యంగా ఏజెన్సీ రంగంలో ఉంది. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రాజెక్ట్ మేనేజర్, ఎంగేజ్‌మెంట్, అకౌంట్ వంటి నాన్-సేల్స్ పాత్రలకు దరఖాస్తు చేశాడు. చివరకు ఏజెన్సీ రంగానికి వెలుపల ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం దక్కింది. ఈ ఉద్యోగాన్ని లింక్డ్‌ఇన్‌ ద్వారా గుర్తించి దరఖాస్తు చేసినట్లు వెల్లడించాడు. కొత్త పని విధానం హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని తెలిపాడు.

AIతో ప్రత్యేక ప్రిపరేషన్

తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AIని విస్తృతంగా ఉపయోగించినట్లు యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో రెడిటర్‌ చెప్పాడు. ప్రతి ఉద్యోగానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్‌ను AI టూల్‌కి ఇచ్చి, ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వివరాలను కూడా అందించేవాడు. వారి లింక్డ్‌ఇన్‌  ప్రొఫైళ్లలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంభావ్య ప్రశ్నలు, చర్చించాల్సిన అంశాలు సిద్ధం చేసుకునేవాడు. ఇంటర్వ్యూల సంఖ్య పెరిగే కొద్దీ తనలోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. ఆసక్తికరంగా, చివరకు తనకు ఉద్యోగం వచ్చిన సంస్థలోని పోస్టుకు తాను మొదట్లో అర్హుడిననే నమ్మకం కూడా లేదని వెల్లడించాడు. అయితే రిక్రూటర్‌తో పాటు హైరింగ్ మేనేజర్, ఇతర టీమ్ లీడర్లతో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలు సాఫీగా సాగడంతో అవకాశం దక్కింది.

AIతో ఉద్యోగ వేటలో కొత్త మార్పు

ఈ వ్యక్తి అనుభవం ఒక్కటే కాదు.. ఉద్యోగ వేటలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. లింక్డ్‌ఇన్‌ 2026 పరిశోధన ప్రకారం, 81% మంది ఉద్యోగార్థులు తమ ఉద్యోగ అన్వేషణలో AIని ఉపయోగిస్తున్నారు లేదా ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే 48% మంది AI టూల్స్ తమ ఇంటర్వ్యూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇక క్లచ్‌ ఇటీవల విడుదల చేసిన మరో సర్వేలో 590 మంది అమెరికన్ ఉద్యోగార్థుల్లో 80% మంది ఉద్యోగ వేటలో AI టూల్స్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 86% మంది AI వల్ల ఎక్కువ దరఖాస్తులు పంపగలుగుతున్నామని చెప్పారు. అయితే 93% మంది AIతో రూపొందించిన రెజ్యూమ్‌లు, కవర్ లెటర్లు అభ్యర్థుల మధ్య ప్రత్యేకతను తగ్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

Got an offer!!
by u/kml3141 in Layoffs

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)