Breaking News

ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?

Published on Thu, 02/08/2024 - 20:37

గతంలో ఫేస్‌బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

2005లో ఫేస్‌బుక్‌ కంపెనీలో ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్‌బుక్‌ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు.

అప్పటికే ఫేస్‌బుక్‌, ఇంటెల్‌, మింట్‌.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్‌ 'యాప్‌సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు.

అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్‌సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు.

ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం

ఇజ్రాయల్ నుంచి వ‌ల‌స వ‌చ్చి అమెరికాలో స్ధిర‌ప‌డిన క‌గ‌న్ టెక్ ప‌రిశ్ర‌మ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ ప‌ర్స‌న్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)