కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు

Published on Tue, 10/07/2025 - 20:22

ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.

ఇదీ చదవండి: మిలియనీర్‌గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!

2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు.

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)