భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్‌

Published on Mon, 09/16/2024 - 13:50

మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక మార్కెట్‌గా భావించే భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్‌ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్‌ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్‌సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్‌లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్‌సర్‌కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!

విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2016లో ఉడాన్‌(ఉడే దేశ్‌కా అమ్‌ నాగరిక్‌) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్‌ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్‌తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)