Breaking News

పాన్‌ కార్డు లేకుండానే ప్రాపర్టీ డీల్స్‌!

Published on Fri, 02/27/2026 - 12:02

దేశంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాన్ కార్డు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ రూ.20 లక్షల లోపు ఉన్న ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేకపోవచ్చని ముసాయిదా ఆదాయపు పన్ను నియమాల్లో సూచించింది. ఈ ప్రతిపాదన కొత్త ఆదాయపు పన్ను పాలనలో భాగంగా తీసుకువచ్చిన మార్పులలో ఒకటి. ప్రస్తుతం ఇది ప్రజా సంప్రదింపుల దశలో ఉంది.

ప్రస్తుతం ఎలా ఉందంటే.. 
ప్రస్తుత నియమాల ప్రకారం.. రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి.

కొత్త ప్రతిపాదన ఏమిటి?
ముసాయిదా ప్రకారం.. రూ.20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేదు. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఈ మార్పు చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది.

గిఫ్ట్‌ డీడ్స్‌, జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలకూ వర్తింపు
సవరించిన ముసాయిదా ప్రకారం, పాన్ నిబంధన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు. స్థిరాస్తి బహుమతిగా బదిలీ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకూ వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలకూ ఇదే రూ.20 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే ఆస్తి విలువ రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.

మార్పు వెనుక కారణం
గత కొన్ని సంవత్సరాల్లో ఆస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక నగరాల్లో సాధారణ ఇళ్ల ధర కూడా రూ.10 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో పాత పరిమితి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు సరిపోవడం లేదని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రతిపాదన వల్ల చిన్న కొనుగోలుదారులపై పేపర్‌వర్క్ భారం తగ్గుతుంది. అఫర్డబుల్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో లావాదేవీలు సులభతరం అవుతాయి. ప్రస్తుత రియల్ ఎస్టేట్ విలువలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.

అమలు ఎప్పుడు?
ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అమల్లోకి వస్తే, చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. అదే సమయంలో, భారీ లావాదేవీలపై పారదర్శకతను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)