‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’

Published on Wed, 12/13/2023 - 12:56

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు మౌలిక సదుపాయాల కోసం గతంలోకంటే ఎక్కువ ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫలితంగా కంపెనీలు ఉత్పాదక పెంచేందుకు ఉపయోగపడే టెక్నాలజీ, మిషనరీ వంటి వాటిపై ఖర్చులు తగ్గించాయి. ఓ పక్కన క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడంతో కంపెనీలు సతమతమవుతుండగా.. ఆ ప్రభావం కాస్త సిబ్బందిపై పడింది. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమయంలో ‘అప్నా’ విడుదల చేసిన నివేదిక మహిళలను కొంత ఊరటనిస్తోంది.

ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్‌ ప్లాట్ ఫారమ్ 'అప్నా' జాబ్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం గురించి కీలక రిపోర్టు విడుదల చేసింది. 5.6 కోట్ల ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే మహిళలు అధిక ప్రభావం చూపుతున్నట్లు ప్రకటించింది. బ్లూ, గ్రే, వైట్ కాలర్ రంగాల్లోని 2.1 లక్షలు స్మాల్‌ అండ్‌ మిడ్‌సైజ్‌ బిజినెస్‌(ఎస్‌ఎంబీ)లు, 400 ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన ఉద్యోగాలకు 33 శాతం మంది మహిళలు దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది మహిళా ఉద్యోగుల వేతనాల్లో సరాసరి 25 శాతం వృద్ధి నమోదు అయినట్లు తెలిసింది. అయితే పురుషుల వేతనాల్లో మాత్రం 17 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. వేతనాల వృద్ధి విషయంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారని చెప్పింది. అక్టోబర్‌లో విడుదలైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగింది. 2022లో ఇది 32.8 శాతం కాగా 2021లో 32.5 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి

ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, చాలా సంస్థల డైవర్సిఫై విధానాల ద్వారా వర్క్ ఫోర్స్‌ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ, ఆర్థిక సేవలు, సప్లై చైన్, లాజిస్టిక్ విభాగాలు ఈ విధానం ద్వారా మంచి పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు. మరో పదేళ్లలో టాప్ లెవల్‌ మేనేజ్‌మెంట్‌లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగవచ్చని భావిస్తున్నారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)