Breaking News

దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు

Published on Fri, 08/15/2025 - 14:00

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా'.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్‌టీ) కొత్త కాన్సెప్ట్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ నాలుగు కార్లు సరికొత్త డిజైన్ కలిగి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

మహీంద్రా ఆవిష్కరించిన కొత్త ''విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్‌టీ'' కార్లు.. ఎన్యూ.ఐక్యూ (NU.IQ) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి.

మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్‌టీ
మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్‌టీ రెండూ కూడా చూడటానికి కొంత థార్ మాదిరిగా ఉంటాయి. విజన్ టీ కారు బాక్సీ బాడీని కలిగి ఉండగా, విజన్ ఎన్ఎక్స్‌టీ డెక్‌లోని స్పేర్ వీల్స్‌కు అనుగుణంగా ఉండే.. ట్రక్ లాంటి క్యాబిన్‌ను పొందుతుంది. మొత్తం మీద ఈ కార్లు దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా విజన్ ఎస్ అనేది బాక్సీ అవుట్‌లైన్‌ పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, ట్విన్ పీక్స్ లోగో, హెడ్‌ల్యాంప్‌ కోసం సరికొత్త డిజైన్ వంటివి గమనించవచ్చు. ఇది ఆఫ్ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది. కాబట్టి రూప్ మీద లైట్స్, దృఢమైన బంపర్, వీల్ ఆర్చ్‌లతో సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివన్నీ గమనించవచ్చు. విజన్ ఎస్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రీమ్‌లైన్డ్ ఓఆర్‌వీఎం, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు.

ఇదీ చదవండి: పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..

మహీంద్రా విజన్ ఎక్స్
మహీంద్రా విజన్ ఎక్స్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో సన్నని హెడ్‌ల్యాంప్‌, పొడవుగా ఉండే హుడ్ వంటివి ఈ కారులో గమనించవచ్చు. పైకప్పు క్రిందికి వాలుగా ఉంటుంది, ఇది కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. విజన్ ఎక్స్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్న వెనుక బంపర్‌ పొందుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)