Breaking News

మహీంద్రా ఈఎస్‌యూవీకి శాంసంగ్‌ డిజిటల్‌ కీ

Published on Sat, 11/01/2025 - 08:57

ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలో డిజిటల్‌ కీ ఫీచర్‌ను అందించేలా మహీంద్రా అండ్‌ మహీంద్రా, శాంసంగ్‌ జట్టు కట్టాయి. ఈ భాగస్వామ్యం కింద శాంసంగ్‌ వాలెట్‌తో మహీంద్రా ఈఎస్‌యూవీలను అనుసంధానం చేస్తారు. దీనితో ఫిజికల్‌ కీ అవసరం లేకుండా డిజిటల్‌గానే కారును లాక్, అన్‌లాక్‌ చేసేందుకు వీలవుతుంది. నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ వల్ల ఒకవేళ ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ మొత్తం అయిపోయినా కూడా డిజిటల్‌ కీ పని చేస్తుందని శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ మధుర్‌ చతుర్వేది తెలిపారు.

ఈ ఫీచర్‌ అంతర్గతంగా పొందుపర్చిన మహీంద్రా ఈఎస్‌యూవీ అమ్మకాలు నవంబర్‌ నుంచి ప్రారంభమవుతాయని, దశలవారీగా ప్రస్తుతమున్న ఇతర కార్లకు కూడా దీన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. 2020 తర్వాత ప్రవేశపెట్టిన గెలాక్సీ జెడ్, ఎస్‌ సిరీస్‌ డివైజ్‌ల్లో శాంసంగ్‌ వాలెట్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎ సిరీస్‌ డివైజ్‌లలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. ప్రస్తుత కార్‌ ఓనర్లు.. మహీంద్రా సరీ్వస్‌ సెంటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.  

భారత్‌లో విక్రయించే బీఎండబ్ల్యూ, బీవైడీ, మెర్సిడెస్‌ బెంజ్‌ లాంటి విదేశీ కార్లలో ఇప్పటికే డిజిటల్‌ కీస్‌ సదుపాయం ఉండగా, ఈ ఫీచరును అందించే తొలి భారతీయ ఆటోమొబైల్‌ కంపెనీగా మహీంద్రా నిలుస్తుంది. డిజిటల్‌ కార్‌ కీ కోసం శాంసంగ్‌తో జట్టు కట్టడంపై మహీంద్రా అండ్‌ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్‌ డివిజన్‌) నళినికాంత్‌ గొల్లగుంట హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్‌ ఐడియాలు

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు