Breaking News

కేవలం 300 మందికే ఈ బ్యాట్‌మాన్ ఎడిషన్: ధర ఎంతంటే?

Published on Sat, 08/16/2025 - 16:51

మహీంద్రా & మహీంద్రా దేశీయ మార్కెట్లో 'బీఈ 6 బ్యాట్‌మాన్' ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.27.79 లక్షలు. కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న బ్యాట్‌మ్యాన్ డే సందర్బంగా మొదలవుతాయి. కాగా సంస్థ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే దీనిని 300 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుంది.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్‌తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్‌పై బ్యాట్‌మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్‌ ఉన్నాయి. బ్రేక్‌లు, స్ప్రింగ్‌లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్‌ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)