ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్‌!

Published on Wed, 04/15/2026 - 11:33

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్‌గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది.

మెరుగైన సేవలు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ నూతన విధానాన్ని వెల్లడించారు. ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్ల వల్ల భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘మరాఠీ మన రాష్ట్ర అధికారిక భాష. ప్రజా సేవల్లో దాని వాడకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. డ్రైవర్లకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడటం వస్తేనే ప్రయాణికులకు మెరుగైన భద్రత, సేవలు అందుతాయి’ అన్నారు.

అమలు తీరు.. తనిఖీలు

ఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి రవాణా శాఖకు చెందిన 59 ప్రాంతీయ (ఆర్‌టీఓ), ఉప ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు మరాఠీలో తమ ప్రాథమిక నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి మరాఠీ చదవడం, రాయడం వస్తుందా లేదా అని అధికారులు ధ్రువీకరిస్తారు. కేవలం డ్రైవర్లే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేసే అధికారులపై కూడా నిఘా పెంచనున్నారు. అర్హత లేని వారికి లైసెన్సులు ఇస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!

Videos

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ పై పొన్నవోలు సంచలన రియాక్షన్

Photos

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)

+5

బ్లాక్ శారీలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)