Breaking News

గ్లోబల్‌ ట్రెండ్, గణాంకాలపై దృష్టి

Published on Mon, 03/10/2025 - 04:54

ముంబై: ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్‌ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్‌డాక్‌ ఇండెక్స్‌ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్‌ ట్రెండ్‌ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.   

ఐఐపీ, సీపీఐ 
జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్‌లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్‌లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.  

ఇతర అంశాలూ కీలకమే 
దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్‌ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్‌ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.  
గత వారమిలా
గత వారం(3–7) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్‌ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ 
తెలియజేశారు.

అమ్మకాలువీడని ఎఫ్‌పీఐలు
మార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు 
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్‌ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్‌ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్‌ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)