Breaking News

ఐపీవోకు లగ్జరీ వాచీల కంపెనీ!

Published on Thu, 05/12/2022 - 21:34

 లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్‌ కంపెనీ ఇథోస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 836–878 ధరల శ్రేణి ప్రకటించింది. 20న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. 

వీటికి జతగా కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 11 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2020–21లో కంపెనీ రూ. 386 కోట్లకుపైగా ఆదాయం సాధించగా, దాదాపు రూ. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ దేశీయంగా ప్రీమియం, లగ్జరీ వాచీల భారీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. జాబితాలో ఒమెగా, ఐడబ్ల్యూసీ స్కఫాసెన్, లాంగిన్స్, టిస్సట్, రేమండ్‌ వీల్, లూయిస్‌ మొయినెట్‌ తదితరాలున్నాయి.

ప్రిస్టీన్‌ లాజిస్టిక్స్‌ ఐపీవో బాట 
లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీసుల కంపెనీ ప్రిస్టీన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)