Breaking News

LPG బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

Published on Mon, 09/07/2026 - 16:52

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వంటగ్యాస్ (LPG) రీఫిల్ బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి 45 రోజుల గడువు ఉండేది. అయితే.. ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ గడువును 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రకటించారు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులందరూ ఇకపై 25 రోజుల వ్యవధిలోనే తదుపరి ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

తగ్గిన వ్యవధి
మధ్యప్రాచ్యంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా.. ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో దేశంలో ఎల్‌పీజీ వినియోగాన్ని నియంత్రించేందుకు.. గతంలో బుకింగ్ గడువును పెంచాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేశారు.

అయితే.. ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బుకింగ్‌లు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పాత నిబంధనలను సడలించి 25 రోజుల గడువును అమలు చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది.

మరోవైపు.. దేశంలో ఎల్‌పీజీ అమ్మకాలు కూడా తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టులో ఎల్పీజీ అమ్మకాలు 16.1 శాతం తగ్గి 2.42 మిలియన్ టన్నులకు చేరాయి. అంతకుముందు.. జూలైలో కూడా ఎల్‌పీజీ డిమాండ్ 17.4 శాతం తగ్గింది. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో ఎల్‌పీజీ వినియోగంపై ఆంక్షలు రావడంతో పాటు, కొంతమంది వినియోగదారులు ఇప్పుడు పీఎన్‌జీ వైపు మారారు. దీంతో ఎల్‌పీజీ డిమాండ్ క్రమంగా తగ్గుతోందని సమాచారం.

పెరుగుతున్న పీఎన్‌జీ వినియోగం
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయంలో.. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి రంగాల్లో వినియోగాన్ని నియంత్రించారు. జూన్‌లో ఆంక్షలు ఎత్తివేయడంతో ఎల్‌పీజీ అమ్మకాలు కొంత పెరిగినా, గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాల కోసం ఎల్‌పీజీకి బదులుగా పీఎన్‌జీని ఉపయోగించడం. అందువల్ల భవిష్యత్తులో కూడా ఎల్‌పీజీ  వినియోగంలో కొంత భాగం పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు వైపు మళ్లే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)