Breaking News

ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది 

Published on Thu, 11/27/2025 - 06:20

న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్‌ఫోర్స్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్‌ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్‌ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు. 

ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్‌ ఏఐ, డిజిటల్‌పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే  రోగ లక్షణాలను రికార్డ్‌ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్‌ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్‌ఫాంల వల్లే బ్యాంకింగ్‌ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్‌ఫోర్స్‌కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)