Breaking News

పద్దు ప్రసంగాలు.. సుదీర్ఘమైతే సంచలనాలు!

Published on Thu, 01/30/2025 - 17:07

రాబోయే బడ్జెట్ సెషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. తమ ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో చోటు లభిస్తుందోమోనని బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి చిరువ్యాపారుల వరకూ, వేతన జీవులు మొదలుకొని రోజుకూలీల వరకూ ఇలా.. వివిధ వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా ఏం ప్రకటిస్తారు.. ఎంత సేపు ప్రసంగిస్తారు..? అని ఆమె బడ్జెట్‌ ప్రసంగం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు పన్ను మినహాయింపుల గురించి దేశం ఆశాజనకంగా ఉంది. శనివారం సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించి చేసే ప్రసంగంతో బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.

ఇది చదివారా? ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?

బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కొంత మంది మంత్రులు తమ ప్రసంగాలకు పొయెటిక్ టచ్ ఇచ్చి ఆకట్టుకుంటుంటారు. బడ్జెట్‌ ప్రసంగాలు కొన్నిసార్లు గంటలపాటు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. మరికొన్ని మూడు ముక్కల్లో ముగుస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో ప్రసంగాల ద్వారా ముందుకు తీసుకురావడం మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే బడ్జెట్ ప్రసంగం అంటే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బడ్జెట్ 2025-26 మన ముందుకు వస్తున్న తరుణంలో  భారత బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, సంక్షిప్తమైన ప్రసంగాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

సుదీర్ఘ ప్రసంగాలు
2020 బడ్జెట్ సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి సీతారామన్ భారతీయ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. 2020-21 బడ్జెట్ కోసం ఆమె ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. ఈ బడ్జెట్‌లోనే కొత్త పన్ను విధానం వంటి అనేక కీలక, సంచలన ఆర్థిక సంస్కరణలను సీతారామన్ ప్రవేశపెట్టారు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను కూడా ఆర్థిక మంత్రి అప్పుడే ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘమైన ప్రసంగం మధ్యలో నిర్మలాసీతారామన్‌ ఒకానొక సమయంలో అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ ప్రసంగం 2 గంటల, 19 నిమిషాల నిడివితో ఉన్న 2019 రికార్డును (నిర్మలా సీతారామన్‌దే) బద్దలు కొట్టింది.

సీతారామన్ కంటే ముందు, సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత జస్వంత్ సింగ్‌ది. 2003లో ఆయన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ జాబితాలో తర్వాతి స్థానం అరుణ్ జైట్లీది. ఆయన  2014లో 2 గంటల 10 నిమిషాల ప్రసంగం చేశారు.

అత్యంత సక్షిప్తం ఇదే..
దేశంలోనే అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం.పటేల్ చేశారు. అప్పట్లో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతోనే పూర్తయింది. 2024లో మధ్యంతర బడ్జెట్ ముందు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల వ్యవధిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇదే ఇప్పటి వరకు ఆమె చేసిన అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగం.

మన్మోహన్ సింగ్ పదాలు సుదీర్ఘం
పదాల పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు అప్పటి ఆర్థిక మంత్రి దివంగత డా. మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన  చారిత్రాత్మక బడ్జెట్‌ ప్రసంగంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ తలుపులు తెరిచారు. ఆ సంవత్సరం మన్మోహన్‌ సింగ్ బడ్జెట్ ప్రసంగ పాఠం 18,650 పదాలను కలిగి ఉంది. 

తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆ సంవత్సరంలో మన్మోహన్‌ సింగ్ సమర్పించిన ఆర్థిక సంస్కరణలు సరళీకృత ఆర్థిక వ్యవస్థకు దారితీశాయి. ఆయన సాహసోపేతమైన ప్రణాళికలు, వ్యూహాత్మక విధాన మార్పులు  ప్రపంచంలో భారతదేశ స్థితిని మార్చేశాయి. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)